పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

173


పరులను దమవారిఁ బరికింపనట్లు
పర పైనమొనల పైఁ బర్వె నాక్షణమె.
పోటు గట్టినరక్తపూరంబు వెడలి
పాటవంబున ధూళిపటలంబు నణఁచె
అంతట నరుణోదయమునఁ జీఁకట్లు
వింతగా విరిసినవిధ మయ్యె నపుడు
దళములు కదియ సందడికయ్య మయ్యె.
తలపడి యిటు పోరఁ దపనుండు గ్రుంకి.
క్రుంకినఁ బోక యుక్కున సేన రెండు
వంకలు దెగి వకావకలుగాఁ జెదరఁ
దిమిరంబు వెసఁ బర్వె ధృతరాష్ట్రతనయుఁ
డమితంబుగాఁ గొన్నయపకీర్తి యనఁగ.

సుశర్మ విరాటభూపాలుని గట్టికొనిపోవుట,

అప్పు డాచీఁకటి నని సేయఁ గాన
కొప్పార నున్నవా రున్న చోటులను
నిలిచిన జూచి యానీరజారాతి
ఎలమిఁ బాండవు లని కిచ్చమై నుండఁ
గదనంబు వారికి గడఁగి యేఁ బోక
యొదప దలంచుఁ దా నుదయించి మించె.