పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

ద్విపద భారతము.



గని మత్స్య రాజు త్రిగర్తేశుమీఁదఁ
దన తేరుఁ బఱపించి ధట్టించి తాకి
జడి వట్టిన ట్లర్ధ చంద్రబాణములు
తొడిగి యేసిన వాఁడు తోన కోపించి
మింట మంటలు గ్రమ్మ మెఱుగునారసము
కంటకంబున వైవఁ గార్ముకం బదర
విలు ద్రుంచి వైచిన విభుఁడు వేఱొక్క-
విలు గొని బహుకోపనినృతాస్యుఁ డగుచు
వడిఁ ద్రిగర్తేశునివక్షంబు గాడఁ
దొడిబడి పదునాల్గుతూపులు పఱపి
పదియింట సారధి బదియింట హరులఁ
బదియింటఁ గేతువు భంగించి యార్చె.
వాఁడుఁ గోపించి యవ్వసుధేశుమీఁద
వాడితూపులు నాటె వడి నైదుపదులు.
దొర లిట్లు తలపడి దురము సేయంగ
నురుతరాటోపు లై యుభయసైనికులు
లావులు దాఁపక లలిత వేగమున
వేవితంబుల బాణవితతి నేయుచును
దమకించి పోరాడ ధరనుండిధూళి
తమము కప్పినయట్లు దట్టమై నిగుడి