పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

167



తురగంబు కూలఁ దోడ్తోఁ గాళ్లు విరిగి
యరుగ నోపక దీను లైనరాహుతులు,
ఉదరి డీల్వడి పడి యున్న కాల్బలము,
చిదిసి పో లేక చెచ్చెరఁ గూలుకరులు,
అఱిమురి నుండి యాయముచోటు దాఁకి
కొఱప్రాణములతోడఁ గూలుమావటులు,
రయ మేది కీ లూడి మ్రగ్గు తేరులును
భయమున మ్రాన్పడి పడినమావులును
రథములు గూల సారధులఁ బో విడిచి
ప్రథనంబునకు నోడి పాఱుయూధపులుఁ
గలిగియు నిస్సాణకాహళధ్వనులు
కలయఁ బర్వుటఁ జేసి కదన మొప్పొరె.
అంత నింద్రుఁడు విమానారూఢుఁ డగుచు
నంతరిక్షంబున నరుదెంచి నిలిచి
సురసిద్ధసాధ్యులు సొంపుగాఁ గొలువఁ
బరఁగిన వేడ్కఁ దప్పక చూచు చుండె.

విరాటసుశర్మల సైన్యంబులుపెనఁగి
    సంకులంబుగాఁ బోరుట.

అరులపైఁ గోపించి యాశతానీకుఁ
డరదంబు దోలించి యర్కుఁడో యనఁగ