పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ద్విపద భారతము.


.
ఘోటకంబులఁ దోలి గురుశక్తి మెఱసి
వేటారుతునియ లై వెస డొల్ల నేసి
హేషారవంబుల నిధ్ధకింకిణులు
ఘోషంబు మేఘనిర్ఘోష మై వేలయఁ
గరులఁ గీల్కొల్పి ప్రక్కలు గాఁగ నేసి
కెరలుచుఁ బాఱుచు ఘీంకార మెసఁగ
గదలు ముద్గరములు కడఁకతోఁ ద్రిప్పి
మెదడు వెల్వడ నెత్తిమీఁద వ్రేసియును
రథములు పఱపి సారధుల రథ్యములఁ
బృథివిపైఁ బడ వైచి పేటాడి యంత
నొగ నొగలోఁ దాఁక నుగ్గుగా విరుగఁ
దెగువతో వేఱొకతేరు సంధించి
పోరాడి రివ్విధంబున రెండు తెగల
వారును జయకాంక్ష వర్ధిల్ల నంత.
అప్పుడు సేనల నన్యోన్యహతుల
ముప్పిరి గొనుమూర్ఛ మునుఁగుసద్భటులు,
ఇరుప్రక్క డస్సి పోయిన రౌతుతోడ'
సరగ గుండెలు తెగి చచ్చునశ్వములు,
పక్కెర ల్వ్రక్క లై పల్లంబు లూడి
యెక్కిన భటు వైచి యేగు గుఱ్ఱములు,