పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

165




అప్పుడు రథవార మవని పైఁ బోవ
నుప్పతిల్లినధూళి యుప్పరం బలమ
నుదధులు ఘోషింప నుర్వి గంపింపఁ
గదెలె భూపాలుఁడు ఘనసేనతోడ.
వెస నిట్లు వెడలి యవ్విరటుసైన్యంబు
దెసలు చిల్లలు వోవఁ దివిరి యార్చుటయు
నాత్రిగర్తలసేన లటు పోక నిలిచి
చిత్రలాఘనసత్త్వశీఘ్రయానముల
వల నొప్పఁ గోపించి వచ్చి తాకుటయు
నెలమితోఁ దలపడి రిరువాఁగు లప్పుడు.
శింజినీటంకారసింహనాదములఁ
గంజజాండము నల్లకల్లోలు మయ్యె.
మెఱఁగువాలమ్ములు మెఱుఁగుశూలములు
మెఱుగునారసములు మెండుగాఁ గప్పఁ
బటుఖడ్గములఁ ద్రుంచి పరిఘము ల్డ్రుంచి
చటులచక్రంబులఁ జక్కుగా నఱకి
వడిఁ బ్రాసములు వైచి వజ్రంబు లాని
అడిదంబులను హతాహతముగా వ్రేసి
చూరకత్తుల చేత సురియలఁ గూల్చి
తోరంపుఁగతులఁ ద్రుంచి చెండాడి