పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ద్విపద భారతము.




వలలునిలావు నెవ్వా రెఱుంగుదురు ?
తలకొని యతఁడు యుద్ధము సేయొ టొప్పు.
మతిఁ దలపోయ దామగ్రంధి శూరుఁ
డతఁడు యుద్ధము సేయ నరుదెంచు టొప్పు.
తేజంబు గల్గుతంత్రీపాలశూరుఁ
డాజి దుర్జయుఁ డౌట నతఁడు రా వలయు.
వీరిలావులు మున్ను వివరించినాము.
వీరికి రథములు వేగఁ దెప్పింపు"
మనవుడు నౌఁగాక యనుచు భూపాలుఁ
డనుజన్ముఁ డైనశతానీకుఁ జూచి
రథములు నాలుగు రమణఁ దెప్పించి
ఫ్రథితశస్త్రాస్త్రవర్మంబు లిమ్మనిన
వాఁడును దెప్పించి వరుసఁ బాండవులఁ
బోఁడిమిగాఁ బురంబునకు రప్పించి
సవరణ లన్నియు సరగ నిప్పించె.
వివిధాంబరంబులు వేడ్కఁ గైకొనుచు
నారూఢమతితోడ నరదంబు లెక్కి
సారధ్యములు తారె చక్కఁ బెట్టుచును
అనయంబుఁ గురుసేన నాపోశనంబు
కొనునంతవేడ్కఁ గైకొనిరి పాండవులు,