పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

163




లావణ్య మేసఁగఁ దెల్లనిజోడు దొడిగి
వేవిధంబులమత్స్యవీరులు గొలువఁ
బదిగఱ్ఱముల నొప్పు పసిఁడితే రెక్కి
కదలె గోపముతోడఁ గదనంబుఁ గోరి,
ఎలమితో మఱియు ననేక బాంధవులు
గొలువ భూపాలుండు గొంతద వ్వేగి
సెలకొని సేన లన్నియు వచ్చుదనుక
నెలవుగా నొకచోట నిలిచి యుండుటయు

నలలదామగ్రంధితంత్రీపాలురతోడఁ గంకుఁడు
యుద్ధమునకురాగోరుట



భీమమాద్రేయులు పిఱుఁద నేతేరఁ
దా మును చనుదెంచి ధర్మనందనుఁడు
సరభసంబున రణసన్నాహ మొప్ప
విరటుఁ దప్పక చూచి వెర వొప్ప బలికె:
"నరనాధ విను మున్ను నా కొక్కమౌని
తిర మైనమంత్రోపదేశంబు చేసె;
ఆమంత్రశక్తిచే నాహవక్రీడ
నే మును పొక్కింత నెఱిఁగి యుండుదును ,
గోవుల విడిపింపఁ గోరి యీరీతి
నీవు సేనలుఁ బోవ నేను రా వలదె ?