పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

ద్విపద భారతము.


పయనంబు నిడి వైనఁ బ్రజ నొవ్వ నీక
నయమునఁ జని మత్స్యనగరంబుఁ జేరి
వేగులవారిచే విరటభూపాలు
గోగణంబులు నున్నగుఱుతు మున్నెఱిఁగి
కోలాహలము చేసి కూడంగఁ బాఱి
యాలమూకలమీఁద నొక్రమించుటయు,
గోపాలకులు లేచి కోపంబు లడరఁ
జాపముద్గరకుంతశరపాణు లగుచుఁ
గాచుచు బలపరాక్రమములు సూపఁ
జూచి సుశర్మ నిష్ఠుర బాణతతుల
సేసి నొప్పించె; ననేక రాహుతులు
చే సూపుతమనాధుసెలవు గైకొనుచు
నీసుమై వారల సేసి యార్వఁగను
గాసిల్లి గోపవర్గము నిల్వ లేక
నెత్తురు వఱదగా నేల గ్రక్కదలఁ
దుత్తుము రై పాఱి దుఃఖంబుతోడ
విరటభూపతిఁ గాంచి వినతు లై భీతిఁ
గరపద్మములు మోడ్చి కడఁక నిట్లనిరి:
" దేవ త్రిగర్తుఁ డేతెంచి యుద్ధమున
గోవులఁ బట్టి యాక్రోశంబు నెరపి