పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రస్తు

ద్విపద భారతము

విరాటపర్వము

శ్రీరమ్యగుణవార, శ్రితజనాధార,
కారుణ్యఫూర, జంగలముమ్మధీర.
చండ తేజుఁడు మున్ను జనమేజయుండు
పాండవకథ లెల్లఁ బరిపాటి వినుచుఁ
జనవున ననియె వైశంపాయనునకుఁ
"జనుదెంచి పండ్రెండుసంవత్సరములు
వనితతో నుత్తలపాటులం బడలి
వనవాసమున నుండి వరుసఁ బాండవులు
ప్రజ లెఱుంగక యుండఁ బయివత్సరమున
విజయు లై యెచ్చోట విహరించి రొక్కొ ?
పరఁగంగ నాలవపర్వంబుకథయు
నిర వొప్ప నాకు నీ వెఱిఁగింపు" మనిన
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపింపఁ దొడఁగెఁ దద్వృత్తాంత మెల్ల :