పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము -ఆ. 3.

158



ఏరూపమున వారి నీక్షింప వచ్చు
నారీతి నెమకింపుఁ డాత్మఁ జింతించి”
అనుటయు రాధేయుఁ డవనీశుతోడ
విన నిచ్చ యగుమాట వేడ్క. నీట్లనియె:
"చారులు వివిధ సంచారు లై వెదకి
పేరు గల్గినయట్టిపృథివీశులొద్ద
వికృతవేషముఁ దాల్చి విహరింతు రేని
నొకనాఁట నరనాట నుదయించు వార్త.”
అనినకర్ణునిమాట లాత్మ గైకొనక
కనుఁగవ గర్వంబు కాలు ద్రవ్వంగ
దుర్యోధనునిఁ జూచి దుశ్శాసనుండు
కార్యంబు తెఱఁ గింత కాన కిట్లనియె:
"ఆ పాండుతనయుల నరయఁబో నేల?
దూపిలుదుష్టజంతువుల చేఁ జిక్కి,
వారు చచ్చినయట్టివనభూములందుఁ
బూరియు నీఁకలు పొడము నింతకును,
ఏకశాసనముగా నెల్ల రాజ్యంబుఁ
జేకొని పాలింపు చింతింప నేల? "