పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

౧౫౧

యంత నంతను బోవ నవియు ద్వారకకు
సెంతయు వెస నేగె; నేమును బోయి
వీధుల నుద్యానవీధుల సౌధ
వీధుల వీక్షించి వెసఁ గాన లేక
తడయక మఱి భూమితలముపై వెడలి
యుడుగ కూఱట లేక యోలి నంతరము
బయలును వనముగా భావించి యరసి
రయముతో గొందియు రచ్చగా వెదకి
చెలమయు గుంటయు. జింతించి యరసి
వెలుఁగును దముముగా వివరించి నెమకి
యేయుపేక్షయు లేక యెఱుకపల్లెయును
బాయక పురముగా భావించి తిరిగి
పాండవు లనువార్తఁ బరికింప లేక
యొండొండ యే మంత నొక చోటఁ గూడి
దేవ నీ కెఱిఁగింపఁ దివిరి వచ్చితిమి
భావింప ధర లేరు పాండునందనులు.

కీచకుఁడు గంధర్వులచేఁ జచ్చె నని చారులు దుర్యోధను కెఱిగించుట.


మఱి యొక్క చిత్రంబు మత్స్యభూపాలు
మఱఁది కీచకుఁ డొకమగువకైఁ బట్ట