పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౪౮

ద్విపద భారతము


అట్టివాండును ఘోర మగుచావు చచ్చె
నెట్టన గంధర్వఓకరంబు చేత
ఉపకీచమలుం వచ్చి రొకయింతి కొఱకు !
అపజయం బిటంమీడ నామత్స్య్యపతికి !
నెఱజోదు లట చేడు నిష్కారణంబు
పఱియ లై మడిసిరి పగవారిచేత
అని యిట్లు సూతులు హతు లైనవార్త
లనయంబు వర్తిల్లె నవనియంతిటను.
అంత నిక్కడం గౌరవభీ శ్వరుండు
కాంతేయుల ప్రతిజ్~ కలు షంబు సేయ
వారి నయ్యజ్ఞాత వాసకాలమున
ధారుణి వెదకింపం దాను పుచ్చుటయుం
జతుల లై పోయిన చార వర్గంబు
కుతల మంతయు. జూచి గోరాడి వెదకి
రూపిపం బాండుపుత్రులు చన్నసన్న
లేపార నెచ్చోట నెఱుగంగ లేక
తిరుగుట చాలించి తిరిగి యే తెంచి
పొరిం బొరి సంకేత భూమిపైం గూడి
ఇత్తెఱం గధివుతో నెఱిగింత? మనుచు
మొత్త మై గజపురంబున కరుదెంచి