పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

ద్విపద భారతము


బచ్చకప్పురమును బాగాలు మొదల
నిచ్చి యిన్నియు నిచ్చి యిట్లని పలికె;

సుదేష్ణ ద్రౌపదిం దనయొద్ద నుండ వల దని పొమ్మనుట.


"చక్కని దానవు; సాధ్వి నీమగలు
చక్కి నుండరు; నీకు జాటి చెప్పెదను
మగవారు నినుఁ జూచి మదన మోహమునఁ
దగులుటయును వారి దారు చంపుదురు!
నీ మోముఁ జూచిన నెలత మా కైన
గామచేష్టలు దోఁచు; కడసారిమాట
వలవ కుండగ రాదు వలచినఁ జేటు !
మెలఁత నీతో నెట్లు మెలంగు వారలము?
కావున మాతోడఁ గాదు నీ వుండ
వేవేగ వెడలుము విభుఁడు. బొ మ్మనియె"
అనుటయుం బాంచాలి యద్దేని మోము
గనుఁగొని వినయంబు గాన రా బలికె;
“పడతుక యిఁక మీఁదఁ బదుమూడుదినము
లెడపక వర్తింప నిమ్ము న న్నిచట
అంత నామగలు ప్రత్యక్ష మై మీకుఁ
జింతించుపను లెల్లఁ జేయ నోఫుదురు;