పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ద్విపదభారతము.

అర్జునునితో ద్రౌపది సల్లాపంబు చేయుట.

అని తారు మును విన్న యట్టికార్యములు
సమరూప మగురీతి నడుగుచోఁ గదిసి
పలికె నింద్రునిపట్టి పాంచాలిఁ జూచి
"జలజాక్షి నిన్నుఁ గీచకుఁ డేమి చేసె?
మఱి కీచకుల నెల్ల మర్దించు తెఱఁగు
నెఱయఁగా నెఱిఁగింపు నీమాట గాఁగ"
అనవుడు నామాట కరనవ్వు నవ్వి
వనజాక్షి తన నేర్పు చల నొప్పఁ బలికె;
"నీ కేమి నీవు కన్నియల కేప్రొద్దుఁ
జేకొని నాట్యంబుఁ జెప్పు చుండుదువు.
కడుకొని యెవ్వ రెక్కడఁ బోయి రేమి
తడవకు మాపాటు తలఁప నీ కేమి ?"
అనిన వాసవపుత్రుఁ డబల కిట్లనియె
"నినుఁ జూచి శోకింప నేర్తు నెంతయును
జెలియ నీతోఁ బొత్తు చేసితిఁ గాన.
తలఁప నీకొక టైనఁ దడవ కుండుదునె?
ఓ చంద్రవదన నే నున్న భావంబుఁ
జూచి యిం కెవ్వరు శోకించువారు ? ”