పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

ద్విపదభారతము.


నగవున విలసిల్లునలు వొప్పు మోము
జగతిఁ బున్న మనాఁటిచంద్రునిం జెనక
సైరంధ్రి వీధిలోఁ జను దెంచునపుడు
పౌరులు తనుఁ జూచి భయము రెట్టింప
"నంగనవలె నుండి యఖిలకీచకుల
మ్రింగిన భూతంబు మెఱసి పోయెడిని!
అరుగుఁ డడ్డము రాకుఁ డటు పోకుఁ డేగి
తెరు విండు తొలగుఁడు తిరిగి చూడకుఁడు,
చూచినఁ దెగఁ జూచుఁ జూ చంద్రవదన
చూచిన సతిపోలె శోభిల్లుఁ గాని !"
అనుచుఁ జేతులు ఱొమ్ము లప్పళించుచును
జను లొకమ్రోతగా జంకక పలుక
నెంతయు సంతోష మెసఁగఁ బాంచాలి
యంత నొయ్యన వచ్చి యట వంటయింటి
వాకిట నిలు చున్న వాయుసంభవునిఁ
బ్రాకటగతి చాయఁ బాఱఁ జూచుచును
దలకొన్న వేడ్కతో దనలోనె తాను
పలుకుచుఁ జనురీతిఁ బలికె నచ్చోట
"నయ మించుకయు లేక నాకుఁ గీచకులు
భయముఁ బుట్టింపఁ దప్పక ప్రోచినట్టి