పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

ద్విపదభారతము

దెరువు గానకయును దిరుగఁ బాఱియును
వెర వొంది పఱచిన భీముండు దఱిమి
కడిఁదిబెబ్బులి లేఁడిగమిమీఁదఁ గవియు
వడువున నెంతయు వారిపై నేచి
చల మొప్ప డాసియుఁ జదియ వ్రేసియును
దల లూడఁ దన్నియు ధరణిఁ బ్రామియును
ఒడిచియు బొడిచియు ను క్కణంచియును
బొడిచియు నడిచియుఁ బోనీక పేర్చి
వరబాహూదర్చ ప్రభావంబు వఱల
వెర వొప్ప నెంతయు వెస నూటయేవు
రుపకీచకులఁ బట్టి యుఱక చెండాడి
విపులాంసముల శౌర్యవిభ్రమం బొప్పఁ
గమలాక్షిఁ గట్టినక ట్టెల్ల నూడ్చి
క్రమ మొప్ప నూరార్చి కన్నీరు దుడిచి
"దేవి యింటికిఁ బొమ్ము తెఱఁ గొప్ప” ననుచుఁ
బావని ఖన్నుఁ డ్రై పాంచాలి ననిచి
యురవున వెడలి వేఱొక మూర్లమునను
బరువడిఁ జనుదెంచె బచనశాలకును.
ధరణీశుఁ డంత గంధర్వుల చేతఁ
బరు వేది కీచకుల్‌ పడిరి నా వినియుఁ