పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

ద్విపదభారతము.

నినుఁ గూల్చినట్టిఁడు నెఱి నెట్టివాఁడొ ! "
అని పెక్కు భంగుల నడలఁగాఁ జూచి
విపులదుఃఖముచేత వెఱఁ గంది యున్న
యుపకీచకుఁడు పల్కె నొకయింత తెలిసి
"మన మెంత యడలిన మనకీచకుండు
విన నేరఁ డిది యేల వెఱ్ఱిగొన్నారు !
అతని కిర వైనయట్టియా తెఱఁగుఁ
జూతురు గా కింక శోకింప నేల ?"

ఉపకీచకులు ద్రౌపదెం గట్టి దహింపం గొనిపోవుట.


అనవుడు నందఱు నడలుట లుడిగి
పనిగొని యచ్చోటఁ బాంచాలిఁ జూచి
"ఇది కాదె కీచకు నింత సేయించె!
ఇదియు నీతనితోడ నేగుఁ గా" కనుచుఁ
బెనచి ద్రౌపదిఁ బట్టి పెడగేలు గట్టి
జననాధునకుఁ జెప్పఁ జని రట్టి తెఱఁగు.
అటమున్నె విరటుండు నతనిచావునకుఁ
బటుతరశోకాగ్నిభరితుఁ డై యున్నఁ
జల మొప్పఁ జనుదెంచి సకలకీచకులు
అలుకఁ దెల్విఁ దొఱంగి యాగ్రహం బెత్తి