పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము

శ్రీ భవ్యదోర్దండ చెరమీరగండ
వైభవో పేంద్ర దేవయముమ్మధీర
వినుము వెండియు నిట్లు వివరింపఁ దొడఁగె
జనమేజయునకు వైశంపాయనుండు:
అంతటఁ బాంచాలి యంతరంగమున
నింతకు బకవైరి యేగు పొ" మ్మనఁగ
వెలయ నాటకశాల వెడలి యచ్చోట
నిలిచి కావలివారి నిద్ర మేల్కొల్పి
తొడుకొని తెచ్చి సూతునిచావుఁ జూపి
యెడపక వారితో నిట్లని పలికె:
“అన్నన్న ! గంధర్వు లయిననామగలు
ఇన్నీ చు వధియించి రక్షింపుఁ డిపుడు,
చక్క నుండక పుణ్యసతులఁ గామించు
మొక్క లీండ్రకుఁ జూవు మొగి నిట్లె వచ్చు."