పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

ద్విపదభారతము.

మనమాట లాలించి మనుజు లెవ్వారు
చను దెంతురో; ప్రొద్దు చాలఁ బోయినది
నిద్రక న్నెఱుఁగక నీవు నిందాఁక
విద్రుమాధరి యుంట వేడ్క నీ వేగు"
మని పల్కి వీడ్కొల్పి యావంటయిల్లు
ననురాగమునఁ జొచ్చి యనిలసంభవుఁడు
ఒడలికి గదురు పోనుదకంబు లాడి
కడుమంచివస్త్రము ల్గట్టి కైసేసి
హంసతూలిక పాన్పు నందు మోదమునఁ
గంసారి మది నెన్ని కనుదోయి మోడ్చె.
అనుటయు ముద మంది యటుమీదికధయు
విన వేడ్క నాకది వినిపింపు మనిన
సత్యహరిశ్చంద్ర సహజ దేవేంద్ర
నిత్యనీరజ నేత్ర నీతిమాంధాత్ర
అనఘాత్మ పంటవంశాంభోధిచంద్ర
జననుత ప్రభురాజ సాహిత్యభోజ
ఆదిగర్బేశ్వరహరినామనిరత
భూదానగోదానభూరిప్రతాప
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప