పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

ద్విపద భారతము.

“ఓరి పాపాత్మ నీయుదుటు గర్వంబుఁ
దీరెను నేటితోఁ దెలిసి పోరాడు.
సైరంధ్రితలఁ బట్టి సభలోన నీడ్చు
క్రూరాత్ముఁడవు నీవు కూలఁ జిక్కి తివి.
ఇచ్చట నాచేత నిటు వంటయిల్లు
చొచ్చినకుందేటిచొ ప్పయ్యె నీకు.”
అనవుడు వాఁడు నుగ్రాటోప మెసఁగ
ననిలజుతోడ నిట్లనియె గర్వించి
"గంధర్వు లేయూరు, కదన మేయూరు,
సంధించి ననుఁ బట్టి చంపు టేయూరు ?
మిమ్ము నేవురఁ జంపి మెలఁత సైరంధ్రి
నెమ్మిమైఁ గైకొందు నేర్పున" ననుచుఁ
గుదియక వెసఁ గీచకుఁడు చేతికొలఁది
"మది నెఱుంగుదు గాక మాట లేమిటికి ? "
ననుచు నిష్ఠుర వృత్తి ననిలజుఁ బొడువ
ననిలజుండును వాని నఱచేత వ్రేసి
బెదరక చెదరక ప్రిదులక పట్టు
వదలక వానిసత్త్వము గుందు టెఱిఁగి
పిడుఁగుతో సరి యైనపిడికిట వానిఁ
బొడిచె నాక్షణమ యద్భుతశక్తి మెఱసి .