పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

123

యిదివేళ కీచకు నే పణంచుటకు,
పదిల మై భుజశక్తి పాటింతు కాక;
వనములోఁ గీచకవ్రజముఁ దక్కించి
ఘనకీచకుల నెల్ల ఖండింతు కాక
నేఁటిరాతిరిలోన నెలమితో " నన్న
దాఁటుచు లేచి సంతస మంది యతఁడు
తలయుఁ జీరయు నాయితము చేసె బిగిచి
యలరఁ బెండ్లికిఁ బోవునంత వేడుకను
నెలఁతఁ బేర్కొని పిల్చి "నీవు నా వెంటఁ
దలకొని వచ్చి యుద్ధముఁ జూడు” మనుచు
వడి మహామత్స్యంబు వనధిలోఁ జొచ్చు
వడువునఁ దమములో వచ్చి యచ్చటను
గొనకొని సింగంబు గుహఁ జొచ్చుమాడ్కి,
ననయంబు వేడ్క నాట్యపుశాలఁ జొచ్చి
మ్రుచ్చు చీఁకటియిల్లు మొగిఁ జొచ్చినట్టు
లిచ్చఁ బొంగుచు భీముఁ డింతితో నపుడు
కడపలు నడవలు కంబంబు లరుగు
లెడపక నెత్తంబు లిక్కువ లెఱిఁగి
యుత్తర ప్రియముతో నుండుమంచమున
నుత్తమభుజసారుఁ డొప్పొర నుండె.