పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

119


పన్నీరు చిలికించి పచ్చకప్పురము
లెన్ని కఁ జల్లించి యెలమిఁ బుట్టంగఁ
కలికిరాచిలుకలు గండుకోయిలలు
వెలయించుపలుకులు వినుచుఁ గూర్చుండి
ద్రౌపదిరూపంబు ద్రౌపదినేర్పు
ద్రౌపదిగరువంబుఁ దలపోసికొనుచుఁ
గలఁగుఁ దత్తఱపడుఁ గంపించు వగచు
విలపించుఁ దలయూఁచు వెఱచి మైమఱచు.
విరహాగ్నిచే నిట్లు వెఱ్ఱియై వాఁడు
తరబడి తనలోనఁ దలపోయఁ డొడఁగె:
పడఁతుక నామాటఁ బాటించు నొక్కొ
కడకు నీడకు వచ్చి కామించు నొక్కొ
రాకకు విఘ్నంబు రాకుండు నొక్కొ
భూకాంతుదేవి తా ఁబొమ్మను నొక్కొ-
ఏకాంతమున నుండి యెల నాగ వేడ్క,
నాకుఁ బ్రీతి యెలర్ప నాతోడ నపుడు
పంత మాడినమాట పరమార్ధ మొక్కొ,
సంతసంబున రాక సాధించు నాక్కొ
తియ్యవిల్లును దానుఁ దెగువుతో డగుచుఁ
దొయ్యలి వలరాజుఁ దో డ్తెచ్చు నొక్కొ!