పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

ద్విపద భారతము.


అనుటయుఁ బాంచాలి యాత్మలో వెఱచి
యనిలసంభవుతోడ నల నొప్పఁ బలి కె:
"ఇంత కోపించిన నెల్లమానవులు
వింతగాఁ జూతురు; విభుఁడ, కోపించి
చేసినకార్యంబు చెనఁటి యై పోవుఁ
జేసేత నపకీర్తి సిద్ధించు మనకు,
ఇరు చెవియును జెక్కు, లేఱుఁగ రా కుండ
వరబలుఁ గీచకుఁ బరిమార్చు మనఘ"
అనిన ద్రౌపది కిట్టు లనియె వాయుఁజుఁడు
"తనలావు నాకు నుద్ధతిఁ జూపునపుడు
పరఁగఁ గీచకుని మాన్పఁగ నేర్తు ననిన
హరిణాక్షి చూచెద నా వేళకొలఁది."
అనిన సంతోషించి యతని దీవించి
పొనరఁ బాండవపత్ని పోయె నింటికిని.

కీచకుఁ డుద్యానవనంబున విహరించుట.

అటఁ గీచకుఁడు మన్మధాగ్ని చేఁ దూలి
ఘటికార్థమును బ్రొద్దు గడపంగ లేక
యెలమావితోఁటలో నేకాంతసీమఁ
బొలు పెనకురువింద పొదరిల్లు చేరి