పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

117


"కలకంఠి వానినిఁ గడతేర్చు పనికిఁ
దలకూర్చి తెంతయుఁ దనరంగ నేనుఁ
బరికించి వంచన బయలు గాకుండ
నరిజయం బొనరించి యన్న మెప్పింతు.
కలగక యొంటి రాఁగలడొకో వాఁడు?
పలుకుఁదోడుగఁ గొంతప్రజఁ దేక రాఁడో.
అంత చేయఁగ నోడు, నబల నీమాట
జింతించు, వాఁడు నిశ్చింత సాహసుఁడు
వచ్చును నిక్కంబు, వచ్చి నాచేతఁ
జచ్చును నీక్కంబు సాధ్వి కీచకుఁడు.
ఏవగ నైన వాఁ డిటు వచ్చి తనదు
భావంబునను కొంత పరికించి తొలఁగ
నప్పు డున్నది వాని కంత్యకాలంబు.
చప్పుడు గా కుండఁ జంపి వెచెదను.
అటుగాక వాడు మహాశ క్తి మెఱసి
పటుగతి నడరిన బ్రహాండ మద్రువ
జలధులు గలఁగ భూచక్రంబు వణఁకఁ
గులగిరు లగల దిక్కులు ప్రయ్యఁ గినిసి
యొగి సాళువము కాకి నొడియుచందమునఁ
దెగి పోరి యేను వధింతుఁ గీచకుని"