పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

ద్విపద భారతము


అనవుడు మదిలోన నాతఁ డుప్పొంగి
"వనిత నీవే త్రోవఁ బరికింపు మేను
నీమాట జవదాఁట నెఱి నమ్ము మీవు.
నేమంబుమై నిన్ను నేఁ గొల్తు నెపుడు ?
మానిని విను నన్ను మఱవ లేవనుచు
నాన యీ వలె" నన్న నల్లన నగుచు
నానీచుపైఁ గోప మాత్మ లో నణఁచి
వానితో మఱియు నవ్వామాక్షి పలికె :

కీచకుని నాట్యశాలకు రమ్మని ద్రౌపది చెప్పుట.

"ఆన యేటికి నిప్పు డయ్యెడుపనికి ?
నే నేల మఱచెద? నీ వింకఁ బొమ్ము ”
అనవుడు” గీచకుం డాత్మ దా నలరి
"వనజాక్షి ననుఁ బ్రోవ వలయు నీ" వనియె .
అనిన నామోదంబు నందిన ట్లతివ
"చనదు నీకును నాకు సల్లాప మిచట.
నడురేయిఁ జేరుము నాట్యాలయంబుఁ
గడువేడ్క నే నందు గాచి యుండెదను.
అడి చూడ నాకు రహస్యస్థలంబు,
కదియ రెవ్వరు దాని గటికి చీఁకటిని,