పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

111


దివ్య మైయొప్పుముత్తియపుహారములు
సవ్యాపసవ్యపార్శ్వములపై వేచి
పడఁతుకల్ ధవళాతపత్రము ల్పట్ట
గడుమంచిరధ మెక్కి కలిమి దీపింప

కీచకుఁడు ద్రౌపదితోడ భాషింప సుదేష్ణ యింటికిం బోవుట.

‘సైరంధ్రి నెలయింతుఁ జలము సాధింతు
మరుని మెప్పింతు నిమ్మహి మింతు" ననుచుఁ
దరమిడి తన సహోదరియింటి కరిగి
సొరిదిఁ గాల్నడతోడఁ జొచ్చి యచ్చటను
దనతోడిమాటకై ద్రౌపదీ దేవి
యొనరంగ నేకాంత మున్న నీక్షించి
నేర్పార నిది మంచినెల వాయె సనుచు
సర్పంబు గఱచినచంద మై వాఁడు
తనకొలుందులు గాక ధైర్యంబు వగలి
మునుకొన్న సిగ్గులో మునిఁగి యేలాడి
మెలఁగుదీమముఁ జేరుమృగముచందమున
జలజాక్షి డగ్గఱఁ జని సింహబలుఁడు