పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

ద్విపద భారతము


దామరమొగడలు తల లెత్తి నవ్వ,
మోములు విన్ననై మొగిఁ గల్వ లొదుఁ గ.
అంత సూర్యోదయం బయ్యెఁ దూర్పునను
సంతసంబున సర్వజనములు మ్రొక్క
హరిహరచతురాస్యు లైక్య మైనట్లు
పరమ తేజము గానఁబడె సృష్టి కనఁగ
బడబాగ్నిముఖమునఁ బడుటకై వెఱచి
జడథి వెల్వడురత్న సంఘమో యనఁగ
నసమున వేదత్రయం బనుశాఖఁ
బస నారఁ బండిన పండొకొ యనఁగ.
ఇనుఁ డిట్లు పొడిచిన నెలమిఁ గీచకుఁడు
తనయనుష్ఠాన మెంతయు వేగఁ దీర్చి
తలఁపులో బాంచాలతనయరూపంబు
నెలకొని కోర్కెలు నించి దైవారఁ
దెఱఁ గొప్పఁ గస్తూరితిలకంబు దీర్చి
మెఱసినజవ్వాది మెయి నిండ నలఁది
చిగురువన్నియ నొప్పుచీనాంబరంబు
తగురీతిఁ గప్పి రత్నపుసొమ్ము దొడిగి
కొలఁదిచెంగలువలుఁ గురువిందవిరులు
మలచినమౌళిపై మకుటంబు పెట్టి