పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

109


ముడుగక వారి కాయుపు నిండినట్లు
వడి నిండ నజ్ఞాతవాసవత్సరము
కడముగా నొకొంతకాలంబు గలదు.
తడయక కీచకాధముఁ జంప వలయు.
పడఁతి ని న్నిటు చేసి పసిముట్ట కెగెఁ
గడఁగి యెల్లియును రాఁ గలవాఁడు వాఁడు.
వచ్చిన నొడఁబడ్డ వైఖరి నీవు
నచ్చుగా 'నొంటిమై నర్థరాత్రమున
నాటకశాల కున్నతి వచ్చి తేని
పాట మై యేనును వచ్చెద నటకు'
అని పల్కి నాతోడ నన్నియుఁ దెల్పి
వినిపింపు నే వాని వెస మడియింతు;
పొమ్ము నీ ” వని వాయుపుత్రుండు లేచి
యమ్ముగ్ధ గొంతద వ్వనిచి వచ్చుటయు
శయ్యకుఁ జనుదెంచి జలజాయతాక్షి
యొయ్యనఁ గనుమోడ్చి యుండె నంతటను
చీఁకటిముసుఁగు విచ్చినభూతలంబు
వీఁకగా నలరారె వెలుఁగొందె దిక్కు
లందుఁ గుంకుమగంధ మలఁదిన ట్లగుచు
సందఱుఁ జూడంగ నరుణుండు పొడిచెఁ