పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

ద్విపద భారతము


గొంతి యీతనిఁ గూడికొని వచ్చుపనికి
నెంతయుఁ జెప్పి నా కిట వచ్చునపుడు.
నా నేర్చునంతఁ గాననభూములందు
బూని తోడ్కొని వత్తు భోజనాదులకు;
పసులవెంబడిఁ జొచ్చి పరులకై నేఁడు
కసుగంది యున్నాఁడు గథ లేల యింక"
అని తనవగ లెల్ల ననిలసూనునకు
వినిపించి యెలుఁ గెత్తి వెస నేడ్చుటయును
దనకును వగ పుట్టి ధైర్యంబుఁ బట్టి
ఘనుఁడు భీముడు కాంతకన్నీరు దుడిచి
"శోకింప నేటికి ? సుఖము దుఃఖంబు
లోకులఁ బ్రాపించు లోలాక్షి, వినుము.
అర్కున కుదయంబు నస్తమయంబుఁ
దర్కింపఁ గలిగె నందఱిఁ జెప్ప నేల ?
రమణి హరిశ్చంద్ర రామచంద్రులకు
గ్రమ మొప్ప నలునకుఁ గలుగదే పాటు?
ఘనకీర్తి లక్షలు గన్నారు వారు;
మనము నట్టుల కామె మదిరాయతాక్షి!
ఒగిఁ గర్ణశకునిదుర్యోధనాధులకుఁ
దగినమృత్యువు వచ్చు దాఁక సైనింపు