పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

105


నలినాక్షి మనకుఁ గాననభూములందు
వెలయఁ దొల్లిటియట్ల విహరింప వలయు.
కావునఁ గోపింపఁ గాదు ధర్మజుని;
భావింప నాసింహబలుడు నా కెంత?
వల నొప్ప నజ్ఞాత వాసవత్సరమ
తలపోయఁ దగుఁ గాక తమకింప రాదు."
అనిన నట్టిద కాదెయని భీమసేనుఁ
గనుఁగొని మఱియు నా కాంత యిట్లనియె:
“ఏమి చెప్పుదు భీమ యీ దేవియింట
నేమంబులో నేను నెరవేర్చుపనులు :
నలుఁగు నూఱియుఁ జందనంబు ఱాచియును
గలయఁ జేతులు నెల్లఁ గాయలు కాచె.
కుంతిదేవికి మీకు గొంతేసికాని
యెంతయు వెఱతు నే నీ సుదేష్ణకును.
వెఱచిన వెఱ పెల్ల వీటిపోవంగి
నుఱక తమ్మునిఘాత కొప్పించె నన్ను '
అంతయు నతివపై నలిగి ధర్మజుని
భ్రాంతిమై దూఱుచుఁ బలికితిఁ గాని
పరహితదయాపరుఁడు ధర్మజుఁడు
పరిచితనీతితత్పరుఁడు ధర్మజుఁడు