పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

ద్విపద భారతము.



సభలోన మున్ను దుశ్శాసనుఁ డర్థి
నభయుఁడై కావించే నంతటి పనులు !
మును జయద్రధుఁ డట్లు మొగి నరణ్యమున
ననుచితం బొసరించె నది చెల్లి పోయె!
నేడు కీచకుఁ డింత నికృతి గావించె,
నాఁడును నేఁడు నున్నారు మీ రెల్ల .
ఎన్నడు మీలావు నెఱిగింప నగునొ ?
ఎన్నఁడు రిపుకోటి నే పణంటలో ?
వెలఁదులు మొఱ వెట్టఁ బెఱవార లేని
దలపోయ రే ప్రోవ ధర్మంబు దలఁచి?
పగతుండు కొలువులోపల నన్నుఁ దన్న
దగునె మిన్నక యుండ ధర్మసూనునకు ? "

ధర్మజుం దూఱఁదగ దని భీముఁడు
ద్రౌపదికిం జెప్పుట,

అనినఁ బాంచాలి కిట్లనియె వాయుజుఁడు
"వనిత ధరజు దూఱ వల దింక నీకు
నా వేళ ననుఁ జూడ కతఁ డూర కున్న
భూవల్లభుని వానిఁ బొరిగొందు నేను
పొరిగొన్న లోకు లప్పుడు నన్ను నెఱిగి
వరుస వాయుజుఁ డని వాక్రుత్తు రేని