పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ద్విపద భారతము



ఆవేళ సఖు లెల్ల నాసింహబలుని
చావు నిక్కముచేసి చాలఁ జింతింప
లీలతోఁ దనపవ్వళించుతావునకుఁ
దూలుచుఁ జనుదెంచె ద్రుపదనందనయు.
చనుదెంచి మైదీఁగ సజ్జపైఁ జేర్చి
కనుఁగవఁ గన్నీటికణములు దొరఁగఁ
బగతురచేతఁ దాఁ బడినపా టెల్ల
నొగిఁ దలపోయుచు నుగ్మలి వగచి
"బలవంతుఁ డగుసింహబలుని మర్దింప
గలఁడు భీముఁడు, నాకుఁ గలఁకయే?" - లనుచు
నినుఁ డస్తమించి పోయిన నడు రేయి
మనుజులందఱు మాటు మణఁగి యుండఁగను
మగువ దిగ్గన ఫేచి మజ్జసం బాడి
పొగడ నొప్పగుపట్టుపుట్టంబు గట్టి
చెక్కుల మెఱుపులఁ జెలఁగి చీకట్లు
వ్రక్కలై పాఱ నా వాసంబు వెడలి
నకు మసియాడంగ నడతెంచె నపుడు
వడముడి నిద్రించు వంట యింటికిని,