పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

99


వెనుకొని పఱతెంచి వెఱ వేది వాఁడు
ననుఁ గూలఁ ద్రోచె మానవనాధు నెదుట,
తరుణి యేఁ బట్టి యింతటిదాన నైతి,
ఇర వొప్ప నెన్నఁడు నిట్టిది యెఱుఁగ."
అనవుడు వెఱపుతో నబల నూరార్చి
తనరఁ గేకయరాజతనయ యిట్లనియె:
"వగవకు వానిగర్వము నెల్ల మాన్చి
తగ దని శిక్షింతుఁ దమ్ముఁ డం చనక.
భూమీశుచూట వమ్ముగఁ బుచ్చుఁ గాని
నామాట నాతఁ డెన్నడు దాఁట వెఱచు.”
అనుకేకయాత్మజ కనియె ద్రౌపదియు
“అనుజు పై నీ వింత యలుగంగ నేల ?
ఉఱుమనిపిడుగులై యువిద నామగలు
చఱప నున్నారు కీచకుపీఁచ మణఁచి.
అప్పు డీపనికి లో నైనవా రెల్లఁ
దప్పఁ జేసితి మని తారె పొక్కెదరు
అనిన మర్మము నాటి యబ్బోటి తలఁకి
తనర ద్రౌపదిఁ బెద్దతడువు ప్రార్ధింప
నాదటఁ దసఖేద మప్పటి కణఁచి
పో దయ్యె మజ్జనభోజనాదులకు.