పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ద్విపద భారతము

.
యెఱుఁగనియదిపోలె నెలుఁగు కంసింప
వెఱఁగుపాటును బొంది వెలఁది కిట్లనియె:
'కలయ నెన్నొసటిపై గంధరఁ గలసి
చెలియ నీకురు లేల చెమటతో నిండె?
వెలఁది నీకన్నీరు వెసఁ జూడ్కి నిలుప
నొలికెడు నేమమ్మ యోసరోజాక్షి ?
మనసులోపల నెంతమాత్రమో వగపు?
వనిత నీవదనంబు వాడఁ బాఱినది ,
ఎలమి నీతను వెల్ల నెలతీఁగఁ బోలి
పొలఁతియెంతయుఁదూలఁబోయియున్నదియ
ఎవ్వఁడు నీదెస నెగ్గు గావించె? ,
చివ్వున వానినే శిక్షింతు" ననిన
"మఱియెవ్వరున్నారు మమ్ము మన్నింప
నెఱిఁగింతు వినుము నీ వెఱుఁగు కార్యంబు.
పరికింప నీవు నొప్పరికించి నన్ను
సురకు బుచ్చితి కాదె సూతునింటికిని,
పుచ్చినఁ జని కల్లు పోయింపు మనిన
నచ్చలంబున వాఁడు నవినీతిఁ దలఁచి
పట్ట వచ్చిన నేను బట్టునఁ బాఱి
నెట్టనఁ గొలువులోనికిఁ జేరుటయును