పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

97


జలజలోచన చాలుఁ జాలుఁ బొ" మ్మనినఁ
దొలఁగక సతి నేర్పుతోడ నిట్లని యె:
“నావల్లభుఁడు మున్ను నటవేషధారి
కావున నా కట్లు కాక పో రాదు.
నటమాత్రుఁడే కాఁడు నాప్రాణనాధుఁ
డటమటంబున జూద మాండంగ నేర్చు.
జూదరియాలి కెచ్చొట నైన నాన
లే దనంగను బని లేదు నీకింక
అని చాయగా నాడి యచ్చోటు తొలఁగి
చనుచుఁ బాంచాలి విచారింపఁ దొడఁగె:

సుదేష్ణకు ద్రౌపది తనపడినపోటుఁ దెలుపుట.

"ఇచ్ఛ నా పాపాత్మునింటికి నిట్లు
పుచ్చినసతి నింకఁ బోయి భోపింతు.
ఎఱిఁగియు నెఱిఁగియు నింత చేసినది
వెఱచునే నాకోపవిధముఁ జూచినను?
వెఱవద కా కేమి వెస నింక నన్ను
డఱమదు కీచకాధమునింటి" కనుచు
నా దైన్యమున వచ్చి యవనీశుసతికి
నాదటఁ బొడసూప నది సంభ్రమించి