పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౨

95

రమణిని నొకఁ డైన రక్షింపలేని
తమపౌరుష మ దేల తమలా వ చేల?
బల మెంత గలిగినఁ బ్రాప్తంబు దప్ప
దిల నెట్టినారికి నేని ; నే నెంత?
ఈవేళ నెవ్వరి నే మనం గలను?
భూవిభుండును బాడిఁ బొరయఁ డెంతయును.
తనభూమి నొకనీచు తప్పు చేసినను
జనునె వారింపక సైరించి యుండ?"
అనవుడు విరటుఁ డయ్యతివమాటలకుఁ
దనయానఁ బచరింపఁ దలఁపు పుట్టియును
హీనసత్వుఁడు గాన నెలమిఁ గీచకుని
నోనాడ నోడి సన్నుతు లొప్పఁ జేసె.
వాఁడును నక్కోపవెభవం బణఁచి
పోఁడిగా నింటికిఁ బోయెఁ బోవుటయు
సైరంధ్రి సభఁ జూచి సభలోనిజనులు
వారికి వారు దైవము దూఱువారు,
భూరాజ్యలక్ష్మి కాఁబోలు నీయింతి
సైరంధ్రి గా దని శంకించువారు,
ఈనతి నిటు సేయ నెంతవాఁ డనుచు
నాసింహబలుమోఁద నలిగెడువారు,