పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

ద్విపదభారతము.

అనిన మిన్నక యుండె ననిలనందనుఁడు.
ననిత మెల్లన లేచి వారి నీక్షించి
ననజంబులను మంచు వ్రాలుచందమునఁ
గనుఁగవ బాష్పంబు గడలుకొనంగఁ,
జంపకంబునఁ బేర్చు సౌరభం బనఁగ
నింపుగా ముక్కున నిట్టూర్పు నిగుడ
విరిసీనకురులతో వెఱపుతో ధూళి
పొరసిన మేనితోఁ బొక్కుచు వచ్చి
జగతీశు డగ్గరి సభవారిఁ జూచు
పగిది నెఱ్ఱనిచూడ్కిఁ బతులఁ జూచుచును
గ్రూరకాకముచేతికోయిలఁ బోలి
యిారెలుంగునఁ గాంతి యేడ్చుచుఁ బలికెః
ద్రౌపది విరటునిసభలోఁ దనభంగపాటుం

దెలుపుట.

"అకట నామగలు ధర్మాధర్మవిదులు
సకలశాత్రవలోకసంహారపరులు
పరులకు నైన నాపద లైన నణఁచి
వరుసఁ గీర్తులు గన్న వంశరత్నములు
ఏవురు మగలు నా కెలమి గంధర్వు
లీవేళ నన్ను ను పేక్షింప నగునే?