పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

ద్విపద భారతము


నేను పల్కినమాట నీపు నీకొనిన
వైనంబు మఱవంగఁ బాడీయే యిపుడు.
అనవుడుఁ దనచేయుననుచితంబునకు
వనిత శంకించియు వలవంతఁ దమ్ముఁ
డడలుటం డలపోసి యాసాధ్వితోడ
గడువేడ్క మంజులగతిఁ బల్కె నిట్లు:
"అక్కట! యే వేడ్క నానుమద్యమున
కొక్కనీచను బంప నోపమిచేసి
నీతోడఁ జెప్పిన నీ వింత నన్ను
నీతిఘాతినిఁ జేసి నేర్చి యాడితివి.
వనిత నాయి ల్లేమి ? వానియి ల్లేమి ?
సీను లాఁతియింటికి నే బుత్తునమ్మ?
నీ సాధుగుణములు నీ చరిత్రములు
సీసమీపము వార లెఱుఁగ కున్నారె ?”
అనిన ద్రౌపది యంత "నబలతో నింత
పెనఁగుట కొఱగాదు ప్రియ మేదు " ననుచు
నుల్లంబు వగపున నుఱ్ఱూఁత లూఁగ
మెల్లన సతిమాట మేకొనఁ జూచి
"సురభిగంధముచేత సురుచిరం బైన
సురఁ దెత్తు నీకు భాసురలీల" ననుచు