iv
శా॥ తారేశాభ యశోవిశాలుఁడుగు రాధాకృష్ణ విద్వత్ప్రభుం
డారాద్ధాంధ్ర సరస్వతీ విభవుఁడై యాంగ్లాఢ్యుఁడౌ రామలిం
గారెడ్డి ప్రభుఁడున్ మహామహిమ లీఁగా నశ్వవాలోపమం
బై రాజిల్ల నితం డతోధికత విద్యాసంస్థ నేలుం బలే. 6
శా॥ ఆంధ్రవ్యాకృతి సంహితాహ్వయ మతివ్యాసంబు శాస్త్రార్థ నీ
రంధ్రంబున్ వెలయించినం దెనుఁగు భారత్యాకృతిన్ శబ్దత
త్వాంధ్ర వ్యాకృతి లేమి నౌ కొఱఁత పాయన్ రాకయుండంగ నీ
యాంధ్రీ పుత్రుఁడు కృష్ణ ముఖ్యుఁ డది మాయం దీర్చె నేతత్కృతిన్. 7
క॥ ద్వీపాంతరాధిగత వి । ద్యాపీఠ సదర్థశాస్త్రి తాగ్రసరునకున్,
శ్రీపూరితాంధ్ర విశ్వక । ళాపరిష దుపాధినాథ లబ్ధయశునకున్. 8
క॥ ధర నాంద్రీ దేవి కపూ । ర్వ రత్న కనకమయ భూష ద్రావిడ భాషా
పరిశీలన కృతి; దీని । న్విరచింపఁగఁ బ్రోత్సహించు విద్యానిథికిన్. 9
క॥ మేరు ధరాధర ధీరున । కారాద్ధ సరస్వతికిని నాంధ్రాభ్యుదయా
ధారునకుం బుధజనమం । దారునకుం గవిచకోర తారేశునకున్. 10
క॥ పూరిత ఫలానుమేయ । ప్రారంభున కాత్మనుతిపరాఙ్ముఖ మతికిన్
దూరీకృత దురితునకున్ । మారారి రమేశ భక్తి మాన్యాత్మునకున్. 11
వ॥ అభ్యుదయ పరంపరాభివృద్ధిగా, నా రచించిన 'ద్రా
విడ భాషా పరిశీలన' మహాగ్రంథంబు సమర్పితంబయ్యె. 12
విజయనగరము,
ఇట్లు విన్నవించు విధేయుఁడు,
5-5-1955.
వజ్ఝల చిన సీతారామస్వామి శాస్త్రి.
గ్రంథకర్త.