Jump to content

పుట:ద్రావిడ భాషా పరిశీలన.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ విద్వాన్ వే. వేంకటరాజులురెడ్డి మహాశయుల

యుపోద్ఘాతము

కళాప్రపూర్ణ వజ్ఝల చిన సీతారామస్వామి శాస్త్రులవారి నెఱుఁగని యాంధ్ర భాషాభిజ్ఞులు లేరనుటకు సందియము లేదు.

శాస్త్రులవారు తాము రచించిన “ద్రావిడభాషా పరిశీలనము" అను గ్రంథమునకొక పీఠిక వ్రాయవలయునని నా కాన తిచ్చిరి. వారికి మొదట నే నేకలవ్యునివంటి శిష్యుఁడను. తన యాచార్యుని గ్రంధమునకుఁ దా నుపోద్ఘాతము వ్రాయవచ్చునను నఱవములోనున్న యొక సూత్రము చొప్పున నేను వారి కోరిక ప్రకార ముపోద్ఘాతమును వ్రాయఁగడఁగితిని.

మన దక్షిణదేశమునం దఱవలు కాక యితర ద్రావిడ శాఖలవారిలోఁ గొందఱు తమ భాష లార్య భాషాజన్యములని తలంచుట గలదు. ఈ యభిప్రాయము డా. కార్డువెల్లుగారి గ్రంథము వలన మాఱినది. డా. కాల్డువెల్లుగారు విదేశీయులైనను మన దేశమున వసించి చిరకాలము పరిశ్రమించి “The Comparative Grammar of the Dravidian Languages" అను గొప్ప గ్రంథమును రచించి ద్రావిడభాష లార్యభాషా కుటుంబములోనివి కావని స్థిర పఱిచిరి. ద్రావిడ విద్యార్థులు వారి యెడల సదా కృతజ్ఞులై యుండవలయును.

డా. కాల్డువెల్లుగా రఱవ దేశములో నొక చిన్న గ్రామమున నివసించి యఱవభాష నభ్యసించిరి. అందలి 'నన్నూల్‌' టీకను మాత్రమే చదివిరి. 'వృత్తి' యను గొప్ప వ్యాఖ్యను జదివినవారు కారు. అది చదివియే యున్న యెడల వారు 'తొల్కాప్పియము' అను ప్రాచీన వ్యాకరణము నెఱిఁగియుందురు. అట్లైయైనచో వారు 'నాన్-యాన్' అను వానిలో 'నేది ప్రాచీనము" అనెడి విషయమున నంతగా విచారించి యుండరు. వారినాఁటి కఱవ సంఘ వాఙ్మయము ముద్రితము కాలేదు. వారు 'తొల్కాప్పియము - సంఘవాఙ్మయము' మున్నగు వాని నెఱిఁగియున్న చోఁ దమ గ్రంథము నెంతయుఁ బ్రామాణికముగ రచించియుందురు.

డా. కాల్డువెల్లుగారి తర్వాత ద్రావిడ భాషలను విపులముగా విమర్శించుట కెవ్వరు నుద్యమింపలేదు. మహామహోపాధ్యాయ R. నరసింహాచార్యులుగారును, శ్రీ రఘునాథరావు గారును గన్నడభాషలోఁ జిన్నయుపన్యాస గ్రంథములను రచించిరి కీ॥ శే॥ L. V. రామస్వామి ఐయ్యరుగారు" కొన్ని వ్యాసములను వ్రానిరి. ఆంధ్రమందు శ్రీ కోరాడరామకృష్ణయ్య యమ్మేగారు పెక్కు.. సంవత్సరములుగా ననేకవ్యాసములును గొన్ని గ్రంథములును వ్రాసిరి. కీ॥ శే॥ డాక్టరు చిలుకూరి నారాయణరావుగా రాంధ్రభాషాచరిత్రము వ్రాసిరి. విద్వాన్ ప్రొఫెసరు, గంటి జోగిసోమయాజులుగా రాంధ్రభాషావికాసమనెడి యాంధ్రభాషా చరిత్ర, విషయక గ్రంథమును రచించిరి. అఱవమున డా. P. S. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కొంచెముగా విమర్శించిరి. ఎవ్వరును గాల్డువెల్లుగారి గ్రంథమువంటి విశాల గ్రంథము వ్రాయలేదు.

డా. కాల్డువెల్లుగారి గ్రంథ మాంగ్లభాషలో నుండుటచేతఁ గేవల ద్రావిడభాషల పండితులకు సుజ్ఞేయము కాకున్నది. ఆక్కారణమున నాంధ్రవిద్యార్థిజనోపయోగముగ నీ ద్రావిడ