ద్రావిడ భాషా పరిశీలన
కృతి సమర్పణము
శ్లో॥ శ్రీ రస్తు తేజోజయసిద్ధి రస్తు!
దీర్ఘాయు రారోగ్య సమృద్ధి రస్తు ।
దిగన్త విశ్రాన్త యశో౽స్త్వజస్రం |
శ్రీ కృష్ణ విద్వత్ప్రభు శేఖరస్య ॥ 1
రసాలగవృత్తమ్ ఆంధ్ర విశ్వకళా పరిషత్ప్రభు ।
ర్వాసిరెడ్డి కులాంబుధి శీతగుః ।
శాశ్వత శ్రియ మేతు మహీతలే !
కృష్ణ విద్వ దధీశ్వరశేఖరః॥ 2
చ॥ వివిధకులోత్థ గీర్విభవభేదలస త్తమిఱాంధ్ర కన్నడ।
ద్రవిడకుటుంబ వాగమృతధానికి మంథనగంబు మత్కృతిన్ ।
దివిజపవైభవా, కృతిపతిత్వ సమాదృతిఁ గారవించి స।
త్కవిబుధులెల్ల మెచ్చ ననుఁ గాంక్షితసిద్ధిఁ గృతార్థుఁ జేయవే ॥ 3
గీ॥ సర్వనన్మంగళంబులు సంతరించు ।
శాశ్వతంబగు సత్కీర్తి సంఘటించు ।
సప్తసంతానములను బ్రశస్తిఁ గాంచుఁ ।
గృతి, పతికి నంచు వేఁడ సమ్మతిని జూపె ॥ 4
శా॥ లేరే రాజమహేంద్రుఁ డాదిగ ధరిత్రీపుల్ మహాగ్రంథముల్ !
వా రాసన్న యముఖ్య సత్కవులచే వ్రాయించి పాలింపరే ।
యేరైనం దమితాంధ్రకేరళములం దెన్నంగఁ గర్ణాట మం
దీ రీతిం బరిశీలనం బడరు వ్యాకృత్యుక్తి మన్నించిరే॥ 5