పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లున్నను వానినిఁ జదువు వారుగాని, చెప్పవారుగాని యుండరు. ఉపయోగములేక పుస్తకములు చెదలు పట్టిపోవును. తెలుఁగులో బీజగణితము (Algebra) ఉన్నది. క్షేత్రగణితము (Mensuration) ఉన్నది. అట్టిగ్రంథములకు విశేషప్రచారము లేక యవి ప్రాచ్యలిఖితపుస్తక భాండా గారమునందు మూలదాగి యేలయుండవలయును ? వాని నుపయోగించు గురువులు, నభ్యసించు విద్యార్థులును లేక, అట్లగుటచే దెలుఁగులోఁ గూడ 'నాల్జెబ్రా చెప్పవచ్చునా? తెలుగులో ‘జ్యామెట్రి' నేర్పగలమా ? Progressions చెప్పిన ఇంగ్లీషులో జెప్పవలయు నేగాని తెలుఁగులో నేర్పుటకు వీలు లేదు అని మనవారే వాదింపఁ జొచ్చిరి! ఇంగ్లీషు గణితమునకుమాఱుగా లీలావతిగణితమునే మన పాఠశాలలోఁ జెప్పచుండినచో నిట్టి సంశయములు మనవారి కేల పుట్టును ? ఇప్పడు మన పిల్లవాండ్రు ఎఫ్. ఎ. తరగతిలో నేర్చుకొనుచున్న ప్రొగెషనులు, • పెర్ము శేషటేషన్, కాంబినేషనులు ' మన పిల్లలు నాలుగవ యుయిదవ తరగతులలో, ". వ్యవహారము, అంకపాళ వ్యవహారము" అను పేళ్లతో నేర్చుకొని యుందురు. నా తాత్పర్యము పాశ్చాత్య గణితశాస్త్రము మనగణితశాస్త్రమున కంటెఁ దక్కువ యభివృద్ధిలో నున్నది యని చెప్పటకాదు. ఇటీవలి గణితజ్ఞల బుద్ధిసూక్మతచే బాశ్చాత్య గణితశాస్త్రముయొక్క క్షేత్ర మత్యద్భుతముగ వైశాల్యముఁ జెందినదియని నేనెఱుంగుదును. కాని యావిద్య యంతయుఁ దెనుఁగునఁ జెప్పరాదా? జ్ఞాన మొక భాష యొక్క యబ్బసామ్మకాదు. ఏభాష మూలముననైనను దానిని సాధింపవచ్చును. ఎవరి మాతృభాషలో వారు సులభముగను గొలఁది కాలములోను, గొలఁది శ్రమలోపలను తెలిసికొన వచ్చును. పరభాషలో నభ్యసించిన యెడల నెక్కుడు కాలము, నెక్కుడు శ్రమయు, నెక్కుడు ధనవ్యయమును బట్టును. ఈ భేదము కనిపెట్టి యింగ్లీషు విద్యలన్నియు మన భాషలోనికిఁ దెచ్చి లోకులకు బోధించుట సమంజసము , అట్లు చేయక పరభాషలలోఁ జెప్పట స్వభావవిరుద్ధము.

ఇఁక నిప్పటి విద్యాభ్యాసపద్ధతి చూతము. 1_వ ఫారముగాని 2-వ ఫారముగాని మొదలుకొని మన పిల్లవాండ్రకు భూగోళము, అంకగణితము, రేఖాగణితము, పదార్థ విజ్ఞానము మొదలయిన విషయములన్నియు నింగ్లీషునఁ జెప్పఁ బ్రారంభించెదరు. అప్పటికా బాలునికి నింగ్లీషుజ్ఞాన మెంత వఱకుండును? తప్పలు లేకుండ రెండు వాక్యములుకూడ వ్రాయు సామర్థ్యము వాని కుండదు . తనమనస్సులోని యూ హల నింగ్లీషునందుఁ జెప్పఁజాలఁడు. అట్టి వానికి నింగ్లీషునందు రేఖాగణితము చెప్పిన నేమి ప్రయోజనము ? A point is that which has no dimension అనిన వాక్యమునకు నర్థము