పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందు జరుగవలసిన పనినిగూర్చియు, జరుగనున్న పనినిగూర్చియు విచారించెదము

సాధనములు

దేశమందంతట శాస్త్రజ్ఞానాభివృద్ధి కావలయునన్న దేశభాష యందు గ్రంథములు, నాళాస్త్రములను బోధించు పార శాలలు నుండవలయును కేవలము విద్యాపీరములుండి గ్రంథములు లేకపోయినను బ్రయోజనములేదు కేవలము శాస్త్రములుండియుఁ జెప్పవారు లేక పోయిన నుపయోగములేదు ! ఇందుకు దృష్టాంతముగ నొక చిన్న యుదాహరణమిచ్చెదను చెన్నపట్టణమునందు నాయుర్వేద పారశాల యున్నదని మీ రెఱిఁగినవిషయమే అందు నింగ్లీషు పద్దతిప్రకారము శారీర శాస్త్రము (Physiology and Anatomy) అను విషయమొకటి విద్యార్ధులకు బోధించెదరు. పాశ్చాత్య వైద్యశాస్త్రమునం దారితేరిన డాక్టర్లే యీ విషయమును బోధించెదరు కాని యీ విషయమును బోధించు గ్రంథము దేశభాషలందు లేనందున, విషయబోధ చేయుటలో నుపాధ్యాయులకును, విషయమును బోధచేసి కొనుటలో విద్యార్ధులకును మితి లేని పరిశ్రమ కలుగుచున్నది తెలుఁగునందు శ్రీ వీరేశలింగము పంతులుగారిచే రచింపఁబడిన చిన్న శారీరకశాస్త్రము గ్రంధము కలదు. కాని యది యీ తరగతికిఁ జాలదు ఇంతకంటె నెన్నియో మడుంగులు విపులముగ వ్రాయఁబడిన గ్రంథము కావలయును .అట్లే శస్త్రవైద్యమునుగులకించిన గ్రంథము తెలుఁగులో లేనేలేదు ఇతర దేశభాషలందును లేదు కావున నది నేర్చుటయే యసంభవమైనది. ఆవిషయము నాయుర్వేద వైద్యశాలలో నేర్పు విషయములలోనుండి తీసివేసిరి అశ్లే యాయుర్వేదసంబంధమైన యుద్దంథములు సంస్కృతమునందే కలవు తెలుఁగునఁగాని యితర భాషలందుఁగాని లేవు "కావున సంస్కృతము చక్కగ రానివారికి నాగ్రంథ ములవలన విశేష లాభము కలుగదు ఈ యిక్కట్టు నాలోచించి యేు శ్రీభిసజ్మణి పండితగోపాలాచార్యులవా లాయుర్వేద గ్రంథమాల నొక దానిని స్థాపించి గీర్వాణగ్రంథములను చెలుఁగు చేసి యాంధ్రులకృతజ్ఞతకు బాత్రులైరి. మచిలీపట్టణములో స్థాపింపబడిన జాతీయ కళాశాలాధి కారులుకూడ భిన్న భిన్న కళాకౌశల్యములు నేర్పుటకు దగిన గ్రంథములు లేనందున నేగ్రంథములు పరనీయములుగా నేర్పరుపవలయునాయని తొక్కులాట పడుచున్నారు ! ఇది చదువు చెప్పవారుండి చదువుకొను గ్రంథములు లేనందునఁ గలుగు నిబ్బంది ఇళ్లే కొన్ని యెడల గ్రంథము