పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్యమున కంతకు నింగ్లీషుభాష చక్కఁగ వచ్చుటయు, నందు వారు సకలవిద్యలను సాధింపగలుగుటయు నిఁక వేయి సంవత్సరముల కయినను హిందూ దేశమునందు సంభవించునా ? ఎప్పటికిని సంభవింపనేరదు అ ప్లే సంస్కృతము ఇది దేవభాషయని మనకు భక్తియున్నను దేశమునం దెందఱు సంస్కృతపండితులు కలరు సంస్కృతము దేశభాషాభివృద్ధికి సాయముగా నుండవలసినదే కాని మరల నది దేశభాష యగు నన్నమాట కల లోని వార్త సంస్కృతముగాని, యింగ్లీషుగాని హిందూదేశములోని దేశ భాషాస్థానము నాక్రమించుకొన నేరవు దేశభాషలలో విద్యనేర్పుటకంటె ఈ భాషలలో విద్యనేర్పుట యెప్పడును నేర్చుకొనువారికిని, నేర్పువారికిని నెక్కుడు కష్టముగా నుండఁగలదు కావున నా యూభాష ల వారికి నా యాగా భాషలలోనే విద్యాదానము చేయుమార్గముల నిర్మించుట యావశ్యకము

ఇప్పడు మనదేశస్థులు వేఱు వేఱువిద్యల సాధింపనెంచి కొంద కింగ్లండునకును, గొందఱు జపానుకును, గొందఱు అమెరికాకును పోవుచున్నారు. దేశము యొక్క భావిపురోభివృద్ధి కిది మంచి చిహ్నమే కాని యాలాగున నెందఱు పోఁగలరు? లక్ష కొక్కఁడుగాని వేయి కొక్కఁడు గాని వెళ్లగలఁడా వేలకొలఁది ధనము వెచ్చించి యితర బాధలకోర్చి లక్ష కొక్కఁడు పెళ్లివచ్చిన నేమి ప్రయోజనము ? మిగిలిన తొంబదితొమ్మిదివేల తొమ్మిదివందలతొంబదితొమ్మిది మందికి వివిధ విద్యలబ్బుట యెట్లు? వీరిలోఁ గొందఱు కొంచెమింగ్లీషు నభ్యసించెదరనుకొందము మిగిలినవారిగతి ? వారికి జ్ఞానార్జనము చేయుదమన్న కోర్కె పొడమినను జ్ఞానము లభించు మార్గము లేదా? అట్టి సాధనముల నిర్మించుట దొరతనము వారి యొక్కయు, విద్యాధికుల యొక్కయు, ధనాధికుల యొక్కయు నర్ఘకృత్యముకాదా 2 ప్రజలందఱకును విద్య నేర్చుకొనుటకు వీలయిన సాధనములను నిర్మించుట రాజధర్మము ఈయుద్దేశముతోడనే శ్రీశ్రీచక్రవర్తివారు పట్టాభిషేక మహోత్సవకాలమందుఁ బ్రాథమికవిద్యకై 50 లక్షల ధన మొసంగిరి కాన నీధనములో నేమి యెన్నవవంతు దేశాభివృద్ధికై ఖర్చుపడునో చూడ వలసియున్నది మనము కేవలము రాజసాహాయ్యము నమ్మియేయుండఁ గూడదు వారు చేయు సహాయమునకై కృతజ్ఞులమగుచు మనము స్వతంత్ర ప్రయత్నములను జేయుచుండవలెను ఈమార్గమునఁ బోయిన బాగుగనుండునని ముందంజ వేయుటకు విద్యావంతులును, విద్యావంతులచే నారంభింపఁబడిన కార్యములు శాశ్వతములుగ నుండునట్టు చేయుటకు ధనవంతులును సంసిద్ధులైయుండవలెను శాస్త్రజ్ఞానాభివృద్ధికై మనదేశము