పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశభాషలలో శాస్త్రపఠనము

కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు[1]

తల్లిపాలు త్రావి పెరిగిన బాలునకును, దాదిపాలు త్రావి పెరిగిన బాలునకును నెట్టి భేదముండునో స్వభాషయందు శాస్త్రాభ్యాసము చేసిన వారికినిఁ బరభాషయందు జ్ఞానార్జనము చేసినవారికి నట్టిభేదమే యుండును అన్యభాష మొదట నేర్చుకొని పిదప నా భాషయందు శాస్త్రముల గళలఁ జదువుకొనుట ద్రావిడప్రాణాయామము వంటిది కాని యిట్టిప్రాణాయామమే మన దేశమునందుఁ బ్రస్తుతము జరుగుచున్నది తర్క వేదాంతాది పూర్వశాస్త్రముల నేర్చుకొనవలయునన్న సంస్కృతము నేర్చు కొనవలెను రసాయన పదార్థవిజ్ఞానాది శాస్త్రముల నభ్యసింపవలెనన్న నింగ్లీషు నేర్చుకొనవలయును ఈ భాషల నభ్యసించుటకుఁ గొంతకాలము వ్యయపఱుపవలెను ఇవి మన మాతృభాషలు కానందున వీనినిఁ జక్కఁగ నభ్యసించుటకు విశేషముగాఁ బరిశ్రమము, కాలవ్యయమును, ధనవ్యయం బును గలుగుననుటకు సందేహములేదు స్వభాసయందే యన్ని విద్యల నేర్చుకొనుమార్గము లుండినయెడల నీ వ్యయప్రయాసము లన్నియుఁ దప్పిపోవును గదా ! ఉగ్గుపాలతో నేర్పబడిన స్వభాష సహజముగఁ బ్రతి మనుష్యునకు వచ్చును కొద్ది పరిశ్రమతో దానినిఁ బ్రతి మనుజుఁడు నభ్యసించి య0దుఁ బండితుఁడు కావచ్చును ఎట్టిక రినమైన గ్రంథమునైనను, విద్యనైనను, గళ్ళనైనను దనభాషలో నుండెనేని మాన వుఁడు సులభముగ దెలిసికొనఁ గలఁడు అంతి యొు కాదు ఆ భాష నెఱింగిన వారియందఱలో నాయా విద్యలు సులభముగను ద్వరితముగను బ్రసరించి జనుల యున్నతస్థితికిఁ గారణభూతములగును.

స్వభాషయందు విద్యలులేక పరభాష నభ్యసించి విద్యలసాధింపవలసిన హెఁడింట నన్నములేక పొరుగిండ్లు తిరిగి యన్నమును సంపాదించిన వానితో సమానుఁడు మనదేశములో మనకు, అనఁగా బ్రాహ్మణులకు

  1. కీ. శే. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు (1877-1928)