పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము 2 :-- ఏ ఇతర వ్యక్తి స్వాధీనములోనూ లేని ఆస్తి తనకు దొరకగా సొంతదారు కొరకు దానిని కాపాడుటకై లేక అతనికి తిరిగి యిచ్చుటకై అట్టి ఆస్తిని తీసికొనునట్టి వ్యక్తి, ఆ ఆస్తిని నిజాయితీ లేకుండా తీసికొనలేదు, లేక దుర్వినియోగపరచలేదు కనుక అపరాధము చేసినవాడు కాదు; అయితే అతనికి సొంతదారు ఎవరో తెలిసి యున్నప్పుడు లేక కనుగొనుటకు మార్గ మున్నప్పుడుగాని, అతడు సొంతదారును కనుగొనుటకు యుక్తమైన పద్ధతులనుఉపయోగించి సొంతదారుకు నోటీసు పంపి, ఆస్తిని ఆ సొంతదారు క్లెయిము చేయుటకు వీలుపడునంత వరకు ఆ ఆస్తి తో వేచియుండవలసిన యుక్త మై సకాలమునకు ముందుగా గాని, ఆ ఆస్తిని సొంతము చేసికొనినచో అతడు పైన నిర్వచింపబడిన అపరాధము చేసినవాడగును.

అట్టి సందర్భములో ఏవి యుక్త మైన పద్ధతులు, లేక ఏది యుక్తమైన కాలము అనునది సంగతిని గూర్చిన ప్రశ్న.

ఆస్తి దొరికిన వ్యక్తికి ఆ ఆస్తి సొంతదారు ఎవరనిగాని, ఫలానా వ్యక్తి దాని సొంతదారని గాని తెలిసియుండుట ఆవశ్యకము కాదు; ఆస్తిని వినియోగపరచుకొను సమయమున ఆ ఆస్తి తనదని అతడు విశ్వసించకపోవుటయే, లేక దాని అసలు సొంతదారు దొరకడని సద్భావముతో విశ్వసించుటయే సరిపోవును.

ఉదాహరణములు

(ఏ) ఫలానివారిది అని తెలియని ఒక రూపాయి 'ఏ' అను వానికి ఒక రహదారిన దొరకును. 'ఏ' ఆ రూపాయిని తీసికొనును. ఇచట 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయలేదు.

(బి) 'ఏ' కు దారిలో ఒక బ్యాంకు నోటుతోపాటు ఒక జాబు దొరుకును. జాబులోని చిరునామా వలనను,అందలి విషయముల వలనను ఆ నోటు ఎవరిదో అతనికి తెలిసినది. కాని, అతడు ఆ నోటును వినియోగపరచుకొనును. అతడు ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసిన వాడగును.

(సీ) బేరరుకు చెల్లింపదగు ఒక చెక్కు 'ఏ' అను వానికి దొరకును. చెక్కును పోగొట్టు కొన్న వ్యక్తి ఎవరో అతడు ఊహింప లేడు. అయితే చెక్కు యొక్క డ్రాయర్ పేరు అందుగలదు. అతడు తాను ఎవరి పేరిట చెక్కు వ్రాసెనో ఆవ్యక్తి చిరునామాను తెలియజేయగలడని 'ఏ'కు తెలిసియుండియు, సొంతదారును కనుగొనుటకు ప్రయత్నించక 'ఏ' చెక్కును వినియోగించుకొనును. 'ఏ'. ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసినవాడగును.

(డీ) 'జడ్' యొక్క డబ్బులసంచి అందులోని డబ్బుతో సహా క్రిందపడిపోవుటను 'ఏ' చూచును. 'జడ్'కు దానిని తిరిగి ఇచ్చివేయు ఉద్దేశముతో 'ఏ' ఆడబ్బుల సంచిని తీసుకొనును, అయితే తరువాత దానిని తనసొంతము చేసికొనును. “ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసినవాడగును.

(ఈ) 'ఏ' అను నతనికి డబ్బులసంచి దొరకును, అది ఎవరిదో అతనికి తెలియదు. ఆతడు తరువాత ఆది 'జడ్ ' అనునతనికి చెందినదని కనుగొనియు, దానిని తన సొంతము చేసికొనును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసినవాడగును.

(ఎఫ్) 'ఏ' కు విలువగల ఒక ఉంగరము దొరకును. అది ఎవరిదో అతనికి తెలియదు. ఆ ఉంగరము సొంతదారును కనుగొనుటకు ప్రయత్నించకయే దానిని వెంటనే 'ఏ' అమ్మివేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసినవాడగును.


ఒక వ్యక్తి మరణించి నవుడు అతని స్వాధీనములో ఉండిన ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగముచేయుట.

404. ఒకవ్యక్తి మరణించినపుడు అతని స్వాధీనములో ఉండిన ఆస్తి అని ఎరిగియుండి, అప్పటినుండి ఆ ఆస్తిని స్వాధీనపరచుకొనుటకు శాసనరీత్యా హక్కుదారైన ఏ వ్యక్తియు ఆ ఆస్తిని స్వాధీనపరచుకొనలేదని ఎరిగియుండి నిజాయితీ లేకుండా అట్టి ఆస్తిని దుర్వినియోగముచేయు లేక సొంతము చేసికొను వారెవరైనను మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకుకూడ పాత్రులగుదురు; మరియు అట్టి వ్యక్తి మరణ సమయమున అతని గుమాస్తాగా గాని, సేవకుడుగా గాని ఆపరాధి వనిచేయుచుండిన యెడల కారావాసము ఏడు సంవత్సరములదాక ఉండవచ్చును.

ఉదాహరణము

'జడ్ ' అను నతని మరణ సమయమున గృహసామగ్రి, డబ్బు ఆతని స్వాధీనములో ఉండెను. అతని సేవకుడైన 'ఏ' ఆ డబ్బును, దానిని స్వాధీన పరచుకొనుటకు హక్కుదారైన వ్యక్తి స్వాధీన పరచుకొనకపూర్వమే, నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయును, 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము చేసిన వాడగును.