పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మారణాయుధము ధరించి దోపిడి లేక బందిపోటు చేయుటకు ప్రయత్నము.

398. దోపిడీ లేక బందిపోటు చేయుటకై ప్రయత్నించు సమయమున ఆపరాధి ఏదేని మారణాయుధమును ధరించియుండుచో, అట్టి అపరాధికి విధిం చవలసిన కారావాసము ఏడు సంవత్సరములకు తక్కువ కానిదై యుండ వలెను.

బందిపోటు చేయుటకై సన్నాహము చేయుట.

399. బందిపోటు చేయుటకై ఏదేని సన్నాహము చేయువారెవరై నను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బందిపోటు ముఠాకు చెందియున్నందుకు శిక్ష.

400.ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడై నను పరిపాటిగా బందిపోటు చేయుటకై జతగా కూడినట్టి వ్యక్తుల ముఠాకు చెందినవారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగల ముఠాకు చెందియున్నందుకు శిక్ష.

401. ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడైనను, థగ్గుల ముఠా లేక బందిపోటు ముఠాతో కాకుండా పరిపాటిగా దొంగతనమునుగాని, దోపిడీగాని చేయుటకై జతగా కూడిన ఏదేని సంచార, లేక ఇతర వ్యక్తుల ముఠాకు చెందియున్నవారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బందిపోటు చేయుటకై గుమికూడుట.

402. . ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడైనను బందిపోటు చేయుటకై గుమికూడిన ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమంది వ్యక్తులలో తానొకడుగా ఉన్న ఎవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడును, సురియు జుర్మానాకు కూడా పాత్రుడగును.

ఆస్తిని ఆపరాధిక దుర్వినియోగము చేయుటను గురించి

ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయుట.

403. చరాస్తి ని దేనినై నను నిజాయితీ లేకుండ దుర్వినియోగముచేయు లేక సొంతమునకుపయోగించుకొను వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కు చెందిన ఆస్తిని తాసు తీసికొను సమయమున 'ఏ' అనునతడు ఆ ఆస్తి తనదేనని సద్భావముతో విశ్వసించుచు 'జడ్' స్వాధీనము నుండి తప్పించి తాను తీసికొనును. 'ఏ' దొంగతనము చేసినవాడు కాడు. అయితే 'ఏ' తన పొరపాటును కనుగొన్న తరువాత నిజాయితీ లేకుండ ఆ ఆస్తిని సొంత ఉపయోగమునకై వినియోగించుకొనుచో అతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును,

(బీ) 'జడ్' కు స్నేహితుడగు 'ఏ' అనునతడు. 'జడ్' లేనప్పుడు 'జడ్' యొక్క గ్రంథాలయమునకు వెళ్ళి 'జడ్' యొక్క అభివ్యక్త సమ్మతి లేకుండ, ఒక పుస్తకమును తీసికొనిపోవును. ఇచట ఆ పుస్తకమును చదువుకొను నిమిత్తమై దానిని తీసికొనుటకు 'జడ్' యొక్క గర్భితమైన సమ్మతి తనకు గలదను భావముతో 'ఏ' ఉండినయెడల 'ఏ' దొంగతనము చేసినవాడు కాడు. అయితే ఆ తరువాత 'ఏ' సొంత లాభము కొరకు ఆ పుస్తకమును అమ్మినచో అతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును.

(సి) 'ఏ' 'బీ' అనువారు ఒక గుర్రమునకు ఉమ్మడిగా సొంతదారులై యుండగా ఆ గుర్రమును ఉపయోగించుకొను ఉద్దేశ్యముతో 'ఏ' దానిని 'బి' స్వాధీనమునుండి తప్పించి తాను తీసికొనును. ఇచ్చట గుర్రమును ఉపయోగించుకొనుటకు 'ఏ' కు హక్కు ఉన్నందున అతడు ఆ గుర్రమును నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేసిన వాడుకాడు. అయితే 'ఏ' ఆ గుర్రమును అమ్మి వచ్చిన మొత్తమును తాను తన సొంతమునకు వినియోగించుకొనుచో ఆతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును.

విశదీకరణము 1:— కొంత కాలముపాటు మాత్రమే నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయుట ఈ పరిచ్ఛేద భావములో దుర్వినియోగమగును.

ఉదాహరణము

పీటీ వ్రాయకనే సంతకము చేయబడి 'జడ్' కు చెందినట్టి ప్రభుత్వ ప్రామిసరీ నోటొకటి 'ఏ' కు దొరకును.ఆ ప్రామిసరీనోటు 'జడ్' కు చెందినదని 'ఏ' ఎరిగియుండియు, ముందు ఎప్పుడై నను 'జడ్' కు దానిని తిరిగి యిచ్చే ఉద్దేశముతో, దానిని ఒక బ్యాంకరువద్ద అప్పుకు హామీగ కుదువ పెట్టును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసిన వాడగును.