పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(2) ఎవరేని మైనరు బిచ్చమెత్తుటకై నియోగింపబడుటకు గాను లేక ఉపయోగింపబడుటకు గాను, అట్టి మైనరును అవిటివానిని చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

(3) మైనరుయొక్క శాసనసమ్మత సంరక్షకుడు కానట్టి ఏ వ్యక్తి యైనను, అట్టి మైనరును బిచ్చమెత్తుటకై నియోగించునెడల, లేక ఉపయోగించునెడల, బిచ్చమెత్తుటకై ఆ మైనరు నియోగింపబడుటకుగాను లేక ఉపయోగింపబడుటకుగాను ఆ మైనరును అతడు వ్యవహరించినాడని గాని అన్యథా ఆ మైనరు అభిరక్షను పొందినాడని గాని, తద్విరుద్ధముగా రుజువు చేయబడినవే తప్ప, పురోభావన చేయవలెను.

(4) ఈ పరిచ్ఛేదములో, -

(ఏ) ' బిచ్చమెత్తుట ' అనగా -

(1) ఒక బహిరంగ స్థలములో పాటపాడు, నాట్యము చేయు, జోస్యము చెప్పు, గారడీ పనులు చేయు లేక వస్తువులను అమ్ము నెపముతో గాని, అన్యథాగాని బిచ్చము అడుగుట లేక తీసికొనుట అనియు,

(ii) బిచ్చము అడుగు, లేక తీసుకొను నిమిత్తమై ఏవేని ప్రేవేటు ఆవరణములలో ప్రవేశించుట అనియు,

(iii) బిచ్చమును పొందు లేక బలవంత పెట్టి తీసుకొను లక్ష్యముతో తనదైనను, ఎవరేని ఇతర వ్యక్తి దైనను, లేక ఏదేని జంతువుదైనను ఏదేని వ్రణము, పుండు, గాయము, అంగవైకల్యము లేక వ్యాధిని బయటికి కనబరచుట, లేక ప్రదర్శించుట, అనియు,

(iv) బిచ్చము అడుగుటకై లేక తీసుకొనుటకై మైనరును ప్రదర్శన వస్తువుగ ఉపయోగించుట అనియు అర్థము.

(బి) “మైనరు" అనగా --

(i) మగవారి విషయములో పదునారు సంవత్సరముల లోపు వయసు గల వ్యక్తి అనియు,

(ii) ఆడవారి విషయములో పదునెనిమిది సంవత్సరములలోపు వయసు గల వ్యక్తి అనియు,అర్హము.

హత్య చేయుటకుగాను వ్యవహరించుట లేక అపహరించుట.


364 ఏ వ్యక్తి యైనను హత్య చేయబడుటకుగాను, లేక హత్య చేయబడగల అపాయమునకు గురిచేయబడులకుగాను, ఆ వ్యక్తిని వ్యసహరించు లేక అపహరించు వారెవరై నను యాపజీన కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణములు

(ఏ) ఒక దేవతకు 'జడ్' బలి ఈయబడవచ్చునను ఉద్దేశముతో, లేక బలి ఈయబడగలడని ఎరిగి యుండి " జడ్'ను 'ఏ' భారత దేశము నుండి వ్యవహరించును. "ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచించిన అపరాధమును చేసినవాడగును.

(బి) 'బి' హత్య చేయబడుటకుగాను, ఆతనిని అతని ఇంటి నుండి 'ఏ' బలవంతముగ ఎత్తు కొనిపోవును లేక ఆశ చూపించి తన వెంటవచ్చునట్లు చేయును. 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచించిన అపరాధమును చేసిన వాడగును.

వ్యక్తిని రహస్యముగను,అక్రమముగను పరిరోధమునందుంచు ఉద్దేశముతో వ్యవహరించుట లేక అపహరించుట.

365. ఏ వ్యక్తి యైనను రహస్యముగను అక్రమముగను పరిరోధమునందుంచబడునట్లు చేయు ఉద్దేశముతో ఆ వ్యక్తిని వ్యవహరించు లేక అపహరించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వివాహము చేసికొనుట మొదలగువాటికిగాను బలవంత పెట్టుటకై

366. ఏ స్త్రీ యైనను, ఆమె యిష్టమునకు వ్యతిరేకముగా ఎవరేని వ్యక్తిని వివాహమాడవలసినదని బలవంతమునకు గురి కావలెనను ఉద్దేశములో, లేక ఆమె అట్లు బలవంత పెట్ట బడగలదని ఎరిగియుండిగాని, అక్రమ సంభోగము జరుపవలసినదని ఆమె బలవంతమునకు లేదా ప్రలోభమునకు గురికావలెనని, లేక ఆమె అట్లు బలవంత