పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(బి) ఏ' అను పోలీసు అధికారి దొంగిలింపబడిన ఆస్తి ఎచట నిక్షిప్తము చేయబడినదో చూపునటుల చేయుటకై 'బి'ని చిత్ర హింసకు గురిచేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' అను రెవెన్యూ అధికారి ' జడ్ ' నుండి రావలసిన కొన్ని రెవెన్యూ బకాయిలను చెల్లించునట్లు అతనిని బలవంత పెట్టుటకై 'జడ్'ను చిత్రహింసకు గురిచేయును, 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద ఆపరాధమున చేసినవాడగును.

(డీ) 'ఏ' అను జమీందారు ఒక రైతును మక్తా చెల్లించునట్లు బలవంత పెట్టుటకై చిత్రహింసకు గురి చేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసిన వాడగును.

బలవంత పెట్టి నేరమును ఒప్పించుటకు లేక బలవంత పెట్టి ఆస్తిని తిరిగి ఇప్పించుటకు స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.

331. బాధితుని లేక బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టి ఏదేని నేరము చేసినట్లు బలవంత పెట్టి ఒప్పించుటకు గాని, ఏదేని అపరాధమును లేక దుష్ప్రవర్తనను కని పెట్టుటకు దారితీయగల ఏదేని సమాచారము ఇచ్చునట్లు చేయు నిమిత్తముగాని ఏదేని ఆస్తిని లేక విలువ గల సెక్యూరిటీని తిరిగి ఇచ్చుటకు లేక తిరిగి ఇచ్చునట్లు చేయించుటకు లేక ఏదేని క్లెయిమును లేదా అభ్యర్థనను తీర్చునట్లు చేయుటకు లేక ఏదేని ఆస్తి లేదా విలువగల సెక్యూరిటీ తిరిగి ఈయబడుటకు దారితీయగల ఏదేని సమాచారము నిచ్చునట్లు చేయుటకు ఆ బాధితుని లేక ఆ బాధితుని హితాభిలాపియగు ఎవరేని వ్యక్తిని నిర్బంధ పెట్టు నిమిత్తముగాని స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనను పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు తన కర్తవ్య నిర్వహణమును చూచుకొనునట్లు చేయుటకై స్వచ్చందముగా ఘాతను కలిగించుట.

332. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, ఆతడు అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహించు చున్నపుడు గాని, ఆ వ్యక్తి నైనను ఏ ఇతర పబ్లికు సేవకునై నను ఆట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహింపకుండ చేయవలెనను లేక భయపెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశముతోగాని, ఆ వ్యక్తి అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును శాసనసమ్మతముగా నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన ఏదేని పనియొక్క పరిణామముగ గాని, స్వచ్ఛందముగ ఘాతను కలిగించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు తనకర్త వ్య నిర్వహణమును మానుకొనునట్లు చేయుటకై స్వచ్చం దముగా దారుణమైన ఘాతను కలిగించుట.

333. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును నిర్వహించుచున్నపుడు గాని, ఆ వ్యక్తినైనను, ఏ ఇతర పబ్లికు సేవకునైనను, అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును నిర్వహింపకుండ చేయవలెనను లేక భయ పెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశములో గాని, ఆ వ్యక్తి అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యములను శాసనసమ్మతముగ నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన ఏదేని పని యొక్క గాని, స్వచ్ఛందముగ దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ప్రకోపనము కలిగించబడి స్వచ్చంద ముగ, ఘాతను కలిగించుట.

334. ప్రకోపనము కలిగించిన వ్యక్తి కి కాక ఏ ఇతర వ్యక్తి కై నను ఘాత కలిగించవలెనని తాను ఉద్దేశించక, ఘాత కలుగగలదని తాను ఎరిగియుండక, తీవ్ర ఆకస్మిక ప్రకోపనమునకు గురియై స్వచ్చందముగ ఘాతను కలిగించువారెవరైనను, ఒక మాసము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

ప్రకోపనమునకుగురియైస్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.


335. ప్రకోపనము కలిగించిన వ్యక్తికి కాక ఏ ఇతర వ్యక్తి కైనను, దారుణమైన ఘాతను కలిగించవలెనని తాను ఉద్దేశించక, దారుణమైన ఘాతకలుగ గలదని తాను ఎరిగియుండక, తీవ్ర ఆకస్మిక ప్రకోపమునకుగురియై స్వచ్ఛందముగ దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనము, నాలుగు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, రెండు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : పరిచ్ఛేదము, 300లోని 1వ మినహాయింపు, ఏ వినాయింపులకు లోనై యున్నదో అవే వినాయింపులకు కడపటి పరిచ్ఛేదములు రెండును లోనై యుండును.

ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము,

336. మసుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని ఆపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును జేయు వారెవరై సను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, రెండు వందల ఏబది రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగానీ శిక్షింపబడుదురు.