పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవది :---ఆ ప్రకోపనము, స్వయం రక్షణ హక్కునుశాసన సమ్మతముగా వినియోగించుకొనుటలో చేయబడిన దేనివలననైనను కలిగించబడినదై ఉండరాదు.

విశదీకరణము :- ఆ ప్రకోపనము, అపరాధమును హత్యకాకుండచేయుటకు, సరిపోవునంత తీవ్రమైనది,ఆకస్మికమైనది అగునా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న అగును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కల్పించిన ప్రకోపనము వలన ఆవేశము చెంది, 'ఏ' ఉద్రేకముతో 'జడ్' యొక్క బిడ్డ యైన 'వై' ని ఉద్దేశ పూర్వకముగా చంపును. ఆ ప్రకోపనము, ఆ బిడ్డ కలిగించినది కానందునను ఆ ప్రకొపనము మూలముగ ఒక కార్యమును చేయుటలో దుర్ఘటన వలనగాని, దురదృష్టము వలన గాని ఆ బిడ్డకు మరణము కలుగనందునను, ఇది హత్య అగును.

(బి) తీవ్రము, ఆకస్మికమునైన ప్రకోపనమును 'ఏ' కు 'వై' కలుగజేయును. ఈ ప్రకోపనముచే, 'ఏ' కు సమీపము నందే ఉన్నను కనుచాటుగా ఉన్న 'జడ్' ను చంపవలెనను ఉద్దేశము లేకయే, తన్మూలముగా ఆతడు చావగలడని తెలియకయే, 'ఏ' “వై” పై పిస్తోలును కాల్చును, 'జడ్' ను 'ఏ' చంపును. ఇచట “ఏ' హత్య చేయలేదు, కాని అపరాధిక మానవవధను మాత్రము చేసిన వాడగును.

(సీ) 'జడ్' అను ఒక బెయిలిఫ్ శాసన సమ్మతముగా 'ఏ' ను అరెస్టు చేసినాడు, అరెస్టు వలన అకస్మాత్తుగా కలిగిన తీవ్రమైన ఉద్రేకములో 'ఏ' 'జడ్' ను చంపును. పబ్లికు సేవకుడు తన అధికారమును వినియోగించుటలో చేసిన పనిద్వారా ఈ ప్రకోపనము కలుగజేయబడినందున, ఇది హత్య అగును.

(డీ) 'జడ్ ' అను మేజి స్టేటు సమక్షమున 'ఏ' సాక్షిగా హాజరగును. 'ఏ' ఇచ్చిన వాజ్మూలములో ఒక్క మాటను కూడ తాను విశ్వసించుట లేదనియు 'ఏ' తప్పుడు సాక్ష్యమునిచ్చి నాడనియు 'జడ్' అనును. ఈ మాటలవలన అకస్మాత్తు గా 'ఏ' ఉద్రిక్తుడై 'జడ్' ను చంపును. ఇది హత్య అగును.

(ఈ) 'జడ్' యొక్క ముక్కునుపట్టి లాగుటకు 'ఏ' ప్రయత్నించును. తన్నివారణ కై 'జడ్' స్వయం రక్షణ హక్కును వినియోగించు కొనుటలో 'ఏ'ను నొక్కి పట్టు కొనును. తత్ పరిణామముగా ఆకస్మాత్తుగా కలిగిన తీవ్రమైన ఉద్రేకములో 'ఏ' 'జడ్' ను చంపును. స్వయం రక్షణ హక్కును వినియోగించు కొనుటలో చేసిన పనిద్వారా ఈ ప్రకోపనము కలుగజేయబడినందున, ఇది హత్య అగును.

(ఎఫ్) 'బీ' ని 'జడ్' కొట్టును. 'బి' ఈ ప్రకోపనము వలన ఆవేశముతో ఆగ్రహా పేతుడగును. అక్కడే ఉన్న 'ఏ', 'బీ' యొక్క ఆగ్రహమును స్వప్రయోజనమునకు ఉపయోగించుకొనవలెననియు, అతనిచే, 'జడ్' ను చంపించ వలెననియు ఉద్దేశించి తన్నిమిత్తమై 'బీ' చేతికి కత్తిని అందించును. 'బీ' ఆ కత్తితో 'జడ్' ను చంపును. ఇచ్చట 'బీ' ఆపరాధిక మానవవధను మాత్రమే చేసియుండవచ్చును. కాని 'ఏ' హత్య చేసిన వాడగును.

మినహాయింపు 2:-- శరీరమును లేక ఆస్తి నిగురించి స్వయంరక్షణ హక్కును అపరాధి సద్భావపూర్వకముగా వినియోగించుకొనుటలో శాసనరీత్యా తనకు ఈయబడిన అధికారమును అతిక్రమించి, పూర్వచింతన లేకుండను అట్టి రక్షణ హక్కు నిమిత్తమై అవసరనుగు దానికంటే ఎక్కువ కీడును కలుగజేయవ లెనను ఉద్దేశమేదియు లేకుండనుఎవరి పై అట్టి రక్షణ హక్కును వినియోగించుకొనుచున్నాడో ఆ వ్యక్తి కి మరణమును కలిగించినచో, ఆపరాధిక మానవవధ హత్య కాదు.

ఉదాహరణము

దారుణమైన ఘాతకలుగునటుల కాకుఁడ, గుర్రపు కొరడాతో 'జడ్' 'ఏ' ను కొట్టుటకు 'జడ్' ప్రయత్నించును. ఏ' పిస్తోలును బయటకు తీయును. 'జడ్' దౌర్జన్యమును కొనసాగించుచుండును. 'ఏ' తాను గుర్రపు కొరడా దెబ్బలను తప్పించుకొనుటకు వేరు మార్గము లేదని సద్భావ పూర్వకముగా విశ్వసించి, 'జడ్' ను పిస్తోలుతో కాల్చి చంపును, “ఏ' హత్య చేయలేదు, కాని ఆపరాధిక మానవవధను మాత్రమే చేసిన వాడగును.

మినహాయింపు 3:—ఆపరాధిక మానవవధ చేసిన అపరాధి, తాసు పబ్లికు సేవకుడుగా ఉండి, లేక న్యాయపాలన నిర్వహణ కై వ్యవహరించుచున్న పబ్లికు 'సేవకునికి తోడ్పడుచుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తన కర్తవయమును తగు రీతిగా నిర్వహించుటకు శాసనసమ్మతమై నదనియు, ఆవశ్యకమై నదనియు తాను సద్భావముతో విశ్వసించి మరణము కల్పించబడిన వ్యక్తి పట్ల పగ లేకుండను, శాసన రీత్యా తనకు ఈయబడిన అధికారములను అతిక్రమించి ఒక కార్యమును చేయుట ద్వారా మరణమును కలుగజేసినచో ఆపరాధిక మానవవధ హత్యకాదు.